AP: రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇవాళ ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో 60 శాతం పంపిణీ పూర్తయింది. అయితే పింఛన్ల పంపిణీ ప్రారంభించిన కాసేపటికే సర్వర్ సమస్య తలెత్తింది. కొద్ది సేపటి తర్వాత సమస్క పరిష్కారం అవ్వడంతో అధికారులు పింఛన్లు అందజేస్తున్నారు. కాసేపట్లో అన్నమయ్య జిల్లా మోటుకట్లలో సీఎం చంద్రబాబు పింఛన్లు పంపిణీ చేస్తారు.