AP: ఏలూరు జిల్లా వట్లూరులోని శిక్షణా కేంద్రంలోని విద్యార్థినులు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. శిక్షణ సాంకేతిక నైపుణ్యాభివృద్ధి సంస్థ కేంద్రంలో 11 మంది విద్యార్థినులు అస్వస్థతకు లోనయ్యారు. అల్పాహారం తర్వాత వాంతులు, విరేచనాలు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. విద్యార్థినులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.