పశుపోషకులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. పశువుల షెడ్ల నిర్మాణం కోసం ప్రవేశపెట్టిన ‘గోకుళం’ పథకాన్ని తిరిగి ప్రారంభించనున్నట్లు పేర్కొంది. అలాగే షెడ్ల ఏర్పాటుకు 90 శాతం రాయితీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గొర్రెలు,మేకలు,కోళ్లకు షెడ్లు నిర్మించుకుంటే 70 శాతం రాయితీ అందజేస్తుండగా యూనిట్ కు గరిష్టంగా రూ.2,07,000 వరకు పెంపకందారులకు లబ్దిచేకూరనుంది.