ప్రపంచంలోనే ఎక్కువ శాతం బియ్యాన్ని ఉత్పత్తి చేసేది, వినియోగించేది చైనా ప్రజలే. ప్రపంచంలోని బియ్యంలో 30% చైనాలో ఉత్పత్తి అవుతోంది. చైనాలో బియ్యం వార్షిక వినియోగం 142 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉంది. 97 మిలియన్ మెట్రిక్ టన్నుల బియ్యం వినియోగంతో భారత్ 2వ స్థానంలో నిలిచింది. ఇండోనేషియా (37 మిలియన్ MT), బంగ్లాదేశ్ (35 మిలియన్ MT), వియత్నాం(22 మిలియన్ MT) వరుసగా 3, 4, 5వ స్థానంలో ఉన్నాయి.