గుంటూరు జిల్లా పెదనందిపాడు బాలుర వసతి గృహంలో వాచ్మెన్ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు బాలురపై వాచ్మెన్ వాహబ్ దాడి చేశారు. బాలుడిని పైకెత్తి కింద పడేశాడు. దాంతో బాలుడు నడవలేకపోతున్నాడు. మరో బాలుడిని తలుపు మీదకు నెట్టడంతో తలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులిద్దరూ బాలురు అన్నదమ్ములుగా గుర్తించారు. పెదనందిపాడు ఆస్పత్రిలో బాలురును తల్లిదండ్రులు చికిత్స కోసం చేర్పించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.