కొత్తిమీర తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కొత్తిమీర తినడం వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కొత్తిమీర ఆకులను కషాయంగా చేసి పుక్కిలిస్తే చిగుళ్ల నొప్పులు, దంతాల నొప్పులు తగ్గుతాయి. ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులను నివారిస్తుంది. ఇందులో ఉండే ఫ్రీ రాడికల్స్ క్యాన్సర్, గుండె జబ్బులను అదుపులో ఉంచుతాయి. బీపీని కంట్రోల్ చేస్తుంది. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.