ఏపీ అసెంబ్లీ సమావేశాలు అట్టుడికిపోవడమే ఇంతకాలం అంతా చూసారు. కానీ తొలిసారి అసెంబ్లీలో చల్లగా కూల్ గా సమావేశాలు జరుగుతున్నాయి. అదే శాసనమండలిలో మాత్రం వేసవి కాలం వేడిని తలపించేలా చర్చలు సాగుతున్నాయి. శాసనమండలిలో వైసీపీకి 30 మందికి పైగా ఎమ్మెల్సీలు ఉన్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదా కూడా వైసీపీకి ఉంది. ఈ క్రమంలో శాసనమండలిలో బొత్స వర్సెస్ అచ్చెన్నాయుడు అన్నట్లుగా సభలో కొంత సాగింది. అలాగే వరుదు కళ్యాణి వర్సెస్ మంత్రి అనిత అన్నట్లుగానూ సాగింది.