ఢిల్లీలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. జ్వరంతో బాధపడుతున్న ఓ బాలుడు వైద్యుడి వద్దకు వెళ్ళాడు. ఆయన బాలుడి నోటిలో జ్వరం చెక్ చేయడానికి థర్మామీటర్ పెట్టాడు. అయితే ప్రమాదవశాత్తు థర్మామీటర్ విరిగి పాదరసం అతని శరీరంలోకి వెళ్లింది. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. దీంతో డాక్టర్ సఫ్లా సక్సేనా చాలా సేపు శ్రమించి కోలనోస్కోపీ చేసి పాదరసం పూర్తిగా బయటకు తీసి బాలుడిని కాపాడారు.