గ్రామసభ ద్వారానే గ్రామాలు అభివృద్ధి

54చూసినవారు
గ్రామసభ ద్వారానే గ్రామాలు అభివృద్ధి
అనంతగిరి మండలం బొర్రా సచివాలయంలో గురువారం స్థానిక సర్పంచ్ జన్ని అప్పారావు, ఎంపిటిసి అరుణ నవీన్, అధ్యక్షతన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 2025 - 26 వార్షిక ప్రణాళిక మొదటి గ్రామసభ నిర్వహించారు. ముందుగా గ్రామసభలో గ్రామాలలో నెలకొన్న సీసీ రోడ్డు, త్రాగునీటి, మరుగుదొడ్లు, హౌసింగ్, పారిశుద్ధ్యం, వ్యవసాయ అభివృద్ధి పనులపై చర్చించిన దానిపైన ఏకగ్రీవంగా తీర్మానించారు. అనంతరం ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకం గ్రామ సభల ద్వారానే గిరిజన గ్రామాలు అభివృద్ధి చెందుతుందన్నారు.

సంబంధిత పోస్ట్