అనంతగిరి మండలంలోని గుమ్మాలో ఉన్న అంగన్వాడి భవనానికి మరమ్మతులు చేపట్టాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా అంగన్వాడి భవనం పాడుబడి శిథిలావస్థకు చేరుకోవడంతో సుమారు 20 మంది చిన్నారులకు ఓ అద్దె ఇంట్లో వరండాలోని బోధనాలు కొనసాగుతుందని చిన్నారుల తల్లిదండ్రులు సోమవారం వాపోయారు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి గుమ్మా గ్రామంలో ఉన్న అంగన్వాడి భవనానికి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.