

అరకు: వేల విద్యార్ధుల సూర్యనమస్కారాల అద్భుత దృశ్యం
మహా సూర్యవందనంలో అల్లూరి జిల్లా గిరిజన విద్యార్ధులు రికార్డ్ సృష్టించారు. 21850 మంది గిరిజన విద్యార్థులు 108 నిమిషాల్లో 108 సూర్యనమస్కారాలు చేస్తున్న దృశ్యం కంటికి అబ్బురపరుస్తోంది. అరకులోయ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్ లో సోమవారం సాయంత్రం వేల మంది గిరిజన విద్యార్ధినీ, విద్యార్ధుల సూర్య నమస్కారాలతో, ఆదిత్యుని నామాలతో దద్దరిల్లింది.