విశాఖలోని 29వ వార్డులో ఎన్టీఆర్ వృద్ధాప్య, వితంతు, వికలాంగుల, ఒంటరి మహిళా పెన్షన్లు పంపిణి చేసినట్లు వార్డు కార్పొరేటర్, జీవీఎంసీ మాజీ స్టాండింగ్ కమిటీ మెంబెర్ ఉరికిటి నారాయణరావు తెలిపారు. మంగళవారం వార్డులో అధికారులు, ప్రజా ప్రతినిధులు, టీడీపీ నాయకులు సమక్షంలో పింఛన్లు పంపిణి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు.