జి. మాడుగుల మండలంలోని గెమ్మేలి పంచాయతీ పరిధి చీమలపాడు గ్రామంలో గెమ్మేలి ఆరోగ్య ఉప కేంద్రం సిబ్బంది ఆధ్వర్యంలో శుక్రవారం గిరిజనులు ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులు డ్రైనేజీల్లో పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాలను తొలగించి బ్లీచింగ్ పౌడర్ చల్లారు. దోమకాటు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్త తీసుకోవాలని వైద్య సిబ్బంది అవగాహన కల్పించారు.