గత ఏడు నెలల నుంచి వేతనాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నట్లు వెలుగు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు నక్కపల్లిలో హోమ్ మంత్రి వంగలపూడి అనితకు సోమవారం సాయంత్రం వారు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు అంకితభావంతో ప్రజలకు సేవలు అందిస్తున్నామని వారు పేర్కొన్నారు. వేతనాలు అందక పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వేతనాలు మంజూరుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.