పద్మనాభం: సకాలంలో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలి

65చూసినవారు
పద్మనాభం: సకాలంలో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలి
పీఎం అవాస్ యోజన, ఎన్టీఆర్ నగరాల లేఅవుట్లలో చేపట్టిన ఇళ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆదేశించారు. బుధవారం పద్మనాభం మండలం నరసాపురం గ్రామంలోని లేఅవుట్లలో ఉన్న ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. అధికారులు కాంట్రాక్టర్లు సమన్వయంతో పనిచేసి ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు. కలెక్టర్ వెంట గృహ నిర్మాణ శాఖ పీడీ శ్రీనివాసరావు ఉన్నారు.

సంబంధిత పోస్ట్