బుచ్చయ్యపేట ఉపాధి హామీ పథకం కార్యాలయంలో ఇంజనీరింగ్ కన్సల్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న జి. సతీష్ కుమార్ కి ఉత్తమ అధికారిగా ప్రశంస పత్రం లభించింది. జిల్లా కేంద్రం అనకాపల్లిలో గురువారం జరిగిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ చేతులమీదుగా ప్రశంస పత్రం అందుకున్నారు. అవార్డు గ్రహితను ఎంపీడీవో, ఏపీవో అభినందించారు.