
చోడవరం: శ్రీ సోలాపూర్ అమ్మ ఆలయ అభివృద్ధి కమిటీ ఏర్పాటు
చోడవరం పట్టణ పరిధిలో గల శ్రీ సోలాపూర్ అమ్మవారి ఆలయ అభివృద్ధి కమిటీ సోమవారం ఏర్పాటయింది. గౌరవ అధ్యక్షులు గాడి అప్పారావు, కోలా రమణ, రావాడ సూరిబాబు, కాకర నాగేశ్వరరావు, అధ్యక్షులుగా దండ గోవింద్, ఉపాధ్యక్షులు మల్లూరు సుధాకర్, కార్యదర్శి అడ్డూరు గోపి, సహాయ కార్యదర్శి దసరా తాతారావు, కోశాధికారిగా గొర్రె సింహాచలం నాయుడు, సహ కోసాధికారిగా చింత శంకర్, కాకర త్రినాధ్ పలువురు పాలకవర్గ సభ్యులు ఎన్నికయ్యారు.