ఆగని వర్షం.. జనజీవనం అస్తవ్యస్తం

82చూసినవారు
నర్సీపట్నంలో గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. కురుస్తున్న వర్షాలతో వారపుసంత, ఆదివారం నాడు నిర్వహించిన నాన్ వెజ్ మార్కెట్ బోసిపోయింది. మున్సిపాలిటీలో డ్రైనేజీలు నిండిపోయి మురుగునీరు రోడ్డు మీదకు వచ్చి పారుతోంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. గత నాలుగు రోజులుగా సుమారు 140 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్