నర్సీపట్నం: ఉరేసుకుని యువతి ఆత్మహత్య
నర్సీపట్నం మున్సిపాలిటీ అయ్యన్న కాలనీకి చెందిన వర్రే వర్షిత అనే యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు టౌన్ సిఐ గోవిందరావు మంగళవారం తెలిపారు. యువతి తండ్రి నరసింగరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం సాయంత్రం ఇంట్లో చున్నీతో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నారు. కొన ఊపిరితో ఉన్న ఆమెను చికిత్స నిమిత్తం ఏరియా ఆసుపత్రి తీసుకురాగా మరణించినట్లు వైద్యులు దృవీకరించారన్నారు. కేసు నమోదు చేశామన్నారు.