కె.వెంకటాపురంలో డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు
By Devada Ravibabu 51చూసినవారుకోటవురట్ల మండలం, కె. వెంకటాపురంలో సోమవారం దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి ఎంపీటీసీ కాళ్ళ రత్నం,ఉప సర్పంచ్ గొల్లు శ్రీనివాసరావు, వైసీపీ నాయకులు, పైల శ్రీరామమూర్తి పూలమాలవేసి నివాళులర్పించారు.ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలను ప్రవేశపెట్టి పేదల గుండెల్లో డాక్టర్ వైఎస్ఆర్ చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.