కన్నుల పండుగగా పీర్ల పండుగ జల్ది కార్యక్రమం

68చూసినవారు
కళ్యాణదుర్గం పట్టణంలో బుధవారం పీర్ల పండుగ భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. కళ్యాణదుర్గం పట్టణంలోని ప్రధాన కూడళ్లలో పీర్ల స్వాములను ఊరేగింపుగా తీసుకువస్తుండగా భక్తులు అడుగడుగునా స్వామివారికి చక్కెర చదివింపులు చేయించారు. పీర్ల స్వామి పల్లకి సేవకింద భక్తులు తిరుగుతూ వారి మొక్కులను తీర్చుకున్నారు. పీర్లస్వాముల జల్ది కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. టౌన్ సీఐ తనసిబ్బందితో గట్టి బందోబస్తు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్