ఘనంగా ఫాదర్ ఫెర్రర్ 104వ జయంతి

55చూసినవారు
ఘనంగా ఫాదర్ ఫెర్రర్ 104వ జయంతి
పెద్దపప్పూరు మండల కేంద్రంలోని ఆర్డీటీ పాఠశాల ఆవరణంలో మంగళవారం ఫాదర్ ఫెర్రర్ 104వ జయంతి ఘనంగా నిర్వహించినట్లు, ఎమ్మార్పీఎస్ అనంతపురము వర్కింగ్ ప్రెసిడెంట్ టి. ఆదినారాయణ మాదిగ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతికి ఫాదర్ ఫెర్రర్ చేసిన సేవలు అమోఘమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ ఆనిముల్లా, చింతా పురుషోత్తం, గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్