తాడిపత్రిలో మసీదుల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు

66చూసినవారు
తాడిపత్రి పట్టణంలో రంజాన్ పండుగను పురస్కరించుకుని గురువారం పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పట్టణంలోని మసీదులు ఈద్గా మైదానాల వద్ద డీఎస్పీ గంగయ్య, టౌన్ సీఐ మురళీకృష్ణ, రూరల్ సీఐ లక్ష్మీకాంత్ రెడ్డితొ కలిసి బందోబస్తు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా చర్యలు తీసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.

సంబంధిత పోస్ట్