అనంతపురం నగర మేయర్ మహమ్మద్ వసీం సీఎం చంద్రబాబుపై మంగళవారం విరుచుకుపడ్డారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. హామీలు ఇవ్వడం, మాట తప్పడం చంద్రబాబుకు అలవాటేనని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4 నెలల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా అప్పుడే ప్రజలపై బాదుడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. విద్యుత్ ఛార్జీలను పెంచి రూ. 6, 072 కోట్లను ప్రజలపై భారం వేశారని అన్నారు.