అనంతపురం జేఎన్టీయూలోని కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగం నందు మంగళవారం పిక్సెల్-2కే 24 జాతీయ సదస్సును ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇన్-ఛార్జ్ వీసీ సుదర్శన రావు హాజరై మాట్లాడుతూ.. రానున్న రోజులలో విద్యార్థులు సరికొత్త టెక్నాలజీతో ఆవిష్కరణలను చేస్తూ ముందుకు వెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ వీసీతో పాటు కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి భారతి, పలువురు ప్రొఫెసర్లు పాల్గొన్నారు.