చెన్నేకొత్తపల్లిలో నిలిచిన రాకపోకలు
చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలోని వెల్దుర్తి సమీపంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చిత్రావతి నది గురువారం ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. చిత్రావతి నదిని ఆర్డీవో మహేశ్, తహశీల్దార్ సురేశ్ పరిశీలించారు. నదీ ప్రవాహంతో ఆరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బుక్కపట్నం, కొత్తచెరువు మీదుగా ప్రయాణికులు ప్రయాణం సాగిస్తున్నారు. వర్షాలు ఇలాగే కొనసాగితే మరింత ఉద్ధృతి పెరిగే అవకాశం ఉంది.