మెక్సికో ప్రాంతంలో ఆదివారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.2గా నమోదైందని యూఎస్ జియాలజికల్ సర్వే తెలిపింది. ఈ భూకంపం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తినష్టం జరగలేదు. కొలిమా సరిహద్దుకు సమీపంలో ఆగ్నేయ అక్విలాకు 21కి.మీ కేంద్రంగా 34 కిమీ లోతుల భూకంప కేంద్రం కేంద్రీకృతమై ఉంది. కదలికలు ఆగిపోయే వరకూ ప్రజలు వీధుల్లోకి దూసుకొచ్చారని మెక్సికో జాతీయ సిస్మటాలిజికల్ సర్వీస్ తెలిపింది.