ఎల్లారెడ్డి మండలంలోని మిసాన్ పల్లి గ్రామంలో తీవ్రనీటి ఎద్దడి ఉందని కాంగ్రెస్ నేతలు ఎమ్యెల్యే మదన్ మోహన్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఎమ్యెల్యే ప్రత్యేక నిధులు మంజూరు చేయించారు. మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, కాంగ్రెస్ నేతలు బోర్ వాహనం తీసుకెళ్లి ఆదివారం బోర్ వేయించారు. బోర్లో నీరు పుష్కలంగా రావడంతో నీటి ఎద్దడి తీరింది. దీంతో ఆ ప్రాంత ప్రజలు ఎమ్యెల్యేకు, నేతలకు కృతజ్ఞతలు తెలిపారు.