మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆదివారం రాత్రి వరంగల్ నుండి ఖమ్మం వైపునకు వస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారు రెండు టైర్లు ఒకేసారి పేలడంతో కారు కంట్రోల్ తప్పింది. ఈ సమయంలో డ్రైవర్ చాకచఖ్యంతో వ్యవహరించడంతో ముప్పు తప్పింది. ఖమ్మం (D) తిరుమలాయపాలెం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. మంత్రితో కారులో MLA తెల్లం వెంకట్రావు, డీసీసీబీ డైరెక్టర్లు బొర్రా రాజశేఖర్, తుళ్లూరి బ్రహ్మయ్య ఉన్నారు.