Sep 14, 2024, 08:09 IST/
మధ్యాహ్న భోజనంలో ఊసరవెల్లి, 65 మంది విద్యార్థులకు అస్వస్థత
Sep 14, 2024, 08:09 IST
జార్ఖండ్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో ఊసరవెల్లి కళేబరం రావడం కలకలం రేపింది. టోంగ్రా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అప్పటికే ఆహారం తిన్న 65మంది పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. విద్యార్థులు వాంతులు చేసుకున్నారని, ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.