నేటి మంత్రి సత్య కుమార్ పర్యటన వివరాలు

79చూసినవారు
నేటి మంత్రి సత్య కుమార్ పర్యటన వివరాలు
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ సత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు. గురువారం ఉదయం ఏడున్నర గంటల నుంచి పది గంటల వరకు ధర్మవరం పట్టణంలోని పలు కార్యక్రమాలలో పాల్గొననున్నారు. అనంతరం జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలో జరిగే జిల్లా సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యేలతో కలిసి పాల్గొంటారు. సమావేశం అనంతరం ఐదు గంటలకు బెంగళూరు వెళ్లి అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్లనున్నారు.

సంబంధిత పోస్ట్