రాష్ట్ర బడ్జెట్లో చేనేతకు తీవ్రమైన అన్యాయం జరిగిందని ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటనారాయణ ధ్వజమెత్తారు. మంగళవారం ధర్మవరంలో ఆయన మాట్లాడుతూ సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో అనేక రంగాలకు అదనపు కేటాయింపులు చేసిన ప్రభుత్వం వ్యవసాయం తర్వాత ఎక్కువగా ఆధారపడ్డ చేనేత రంగాన్ని విస్మరించడం బాధాకరమన్నారు. ఎన్నికల అప్పుడు చేనేతను ఆదుకుంటామన్న కూటమి బడ్జెట్ పై ఎందుకు స్పందించలేదన్నారు.