ధర్మవరం పట్టణంలోని కళాశాల మైదానంలో ఆదివారం ముగిసిన చేనేత క్రికెట్ పోటీల్లో ధర్మవరం క్రికెట్ జట్టు విజేతగా నిలిచిందని నిర్వాహకులు సందా రాఘవ తెలిపారు. ఇందులో గొట్లూరు, ధర్మవరం జట్ల ఫైనల్ పోటీలకు అర్హత సాధించాయి. మొదట బ్యాటింగ్ చేసిన గొట్లూరు 16 ఓవర్లలో 78 పరుగులు చేయగా, ధర్మవరం జట్టు 79 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించి విజేతగా నిలిచింది. విజేతను చేనేత ప్రముఖులు అభినందించారు.