ధర్మవరం మున్సిపాలిటీలోని 35వ వార్డులో మంగళవారం డోర్ టు డోర్ జియో ట్యాగ్ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర వైద్య విద్య ఆరోగ్య శాఖ మంత్రి వై. సత్యకుమార్ యాదవ్, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ సూచనల మేరకు, వార్డు సచివాలయ సిబ్బంది డోర్ టు డోర్ జియో ట్యాగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ నారాయణస్వామి, తదితరులు పాల్గొన్నారు.