గుత్తి రైల్వే స్టేషన్ లోని సంఘ్ ఆఫీస్ లో మంగళవారం డీజిల్ బ్రాంచ్ కార్యదర్శి సుభాష్ బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నేషనల్ రైల్వే ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాఘవయ్య మంగళవారం హాజరయ్యారు. ముందుగా వారికి రైల్వే కార్మికులు స్వాగతం పలికారు. డిసెంబర్ 4, 5 తేదీలలో జరగనున్న రైల్వే ట్రేడ్ యూనియన్ ఎన్నికల పై సమావేశం నిర్వహించారు. ఎన్నికల గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.