గుత్తి: సచివాలయం ఎదుట సీపీఐ నిరసన
ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికలలో ఇచ్చిన హామీల మేరకు గ్రామాలలో 3 సెంట్లు, పట్టణ కేంద్రాలలో 2 సెంట్లు చొప్పున అర్హులైన వారికి ఇంటి నివేశ స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం గుత్తి సచివాలయం ఎదుట సీపీఐ నాయకుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. సీపీఐ పట్టణ కార్యదర్శి రాజు మాట్లాడుతూ. అర్హులైన వారికి ఎన్నికలలో ఇచ్చిన హామీల మేరకు ఇంటి నివేశ స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.