గర్భగుడిలో స్వామివారి మూలవిరాట్ చోరీ
అనంతపురం జిల్లా పామిడి పట్టణంలోని పెన్నా నది ఒడ్డున ఉన్న శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో సోమవారం తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు ఆలయంలో ఉన్న శ్రీ భక్తాంజనేయ స్వామి మూలవిరాట్ ను ఎత్తుకెళ్లారు. ఈ చోరీ ఘటనపై ఆలయ ధర్మకర్త పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.