

గుత్తి: ఆధార్ అప్డేట్ కోసం పడిగాపులు
గుత్తి పట్టణంలో గుత్తి కోట లోని ప్రధాన తపాలా కార్యలయం ఒక్కటే ఆధార్ అప్డేట్ కేంద్రం ఉండడంతో గురువారం ఉదయం 5 గంటలకే ఆధార్ అప్డేట్ కోసం చిన్నపిల్లలు, వృద్ధులు పడిగాపులు కాస్తున్నారు. ఆధార్ అప్డేట్ కు డెడ్ లైన్ ఈ నెల 31 వరకు ఉండడంతో ప్రజలు బారులు తీరారు. గత మూడు రోజులుగా ఉదయం 4 గంటలకే వస్తున్నారు. వేడి తాపానికి గురి కాకుండా మునిసిపల్ పరిధిలో ఉన్న సచివాలయాల్లో కూడా ఆధార్ అప్డేట్ సౌకర్యం కల్పించాలని పలువురు కోరారు.