కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో సోయా కొనుగోలు కేంద్రాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం సోయా పంటకు క్వింటాలుకు రూ. 4, 892/-మద్దతు ధర ప్రకటించిందని.. సమీప రైతులు అందరూ సోయా బీన్ పంటను పెద్ద కొడప్గల్ మార్కెట్ యార్డుకు తీసుకొచ్చి విక్రయించాలని కోరారు.