ఈసీ తీరుపై కోర్టును ఆశ్రయిస్తాం: ఎమ్మెల్యే

2018చూసినవారు
ఈసీ తీరుపై కోర్టును ఆశ్రయిస్తాం: ఎమ్మెల్యే
పచ్చచొక్కాలతో కాక్‌టైల్‌ డిన్నర్‌ చేసి అడ్డంగా దొరికిపోయిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ చట్ట పరిధిలో పని చేస్తున్నావా.. లేదా అనే విషయాన్ని ఆత్మపరిశీలన చేసుకోవాలని కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి మండిపడ్డారు. శనివారం ఎమ్మెల్యే కదిరి నియోజకవర్గంలోని పలు మండలాల్లో పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ.. గ్రామాభివృద్ధికి కృషి చేసే సమర్థులైన అభ్యర్థులను సర్పంచులుగా ఎన్నుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజలను కోరారు. అనంతరం ఎమ్మెల్యే తనకల్లు మండలంలో మీడియాతో మాట్లాడారు. ఏకగ్రీవ ఎన్నికలు వద్దనే అధికారం నిమ్మగడ్డకు ఎక్కడిది?.. ప్రెస్‌ మీట్‌లు పెట్టి గందరగోళపర్చడం, అధికారులను భయభ్రాంతులకు గురిచేయడం ఆయనకు అలవాటైపోయింది.చంద్రబాబును నమ్మిన వారెవరూ బాగుపడిన చరిత్రలేదు. నిమ్మగడ్డ త్వరలోనే ఆ విషయం తెలుసుకుంటారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్