

ఉద్యోగుల ఆధ్వర్యంలో కదిరి బస్టాండ్ లో చలివేంద్రం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కదిరి తాలూకా యూనిట్ ఆధ్వర్యములో బుధవారం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షులు భాస్కర్ రెడ్డి చలివేంద్రం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. వేసవి కాలంలో ప్రతి ఒక్కరూ చల్లని నీటితో దాహం తీర్చుకోవాలనుకుంటారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు ఏపీజీఈఏ అసోసియేషన్ తరపున చేయాలని ఆకాంక్షించారు. మున్ముందుకు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.