కళ్యాణదుర్గం పట్టణంలోని బాలికల వసతి గృహానికి ఎమ్మెల్యే సురేంద్రబాబు చొరవతో అధికారులు ఆదివారం గేటు అమర్చారు. మినరల్ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. ఎస్సీ బాలికల హాస్టల్ ను ఎమ్మెల్యే వారం క్రితం సందర్శించారు. ఆ సమయంలో గేటు, మినరల్ ప్లాంటును ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేను విద్యార్థినులు కోరారు. ఆయన ఆదేశాలతో అధికారులు గేటు, వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు.