కళ్యాణదుర్గంలో 9న అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం

79చూసినవారు
కళ్యాణదుర్గంలో 9న అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం
కళ్యాణదుర్గం పట్టణంలో నూతనంగా నిర్మించిన అన్న క్యాంటీన్ ను అక్టోబర్ 9వ తేది ఉదయం 11గంటలకు ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తెలిపారు. సోమవారం ప్రజా వేదికలో మున్సిపల్ కమీషనర్ వంశీకృష్ణతో సమావేశమై ఈ మేరకు ఎమ్మెల్యే చర్చించారు. అన్న క్యాంటీన్లలో రూ.5కే టిఫిన్, భోజనం అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్