కళ్యాణదుర్గం: పాత కేసుల నిందితులను బైండోవర్ చేయాలి

67చూసినవారు
కళ్యాణదుర్గం: పాత కేసుల నిందితులను బైండోవర్ చేయాలి
కళ్యాణదుర్గం ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ పోలీస్ స్టేషన్ ను సోమవారం అనంతపురం డిప్యూటీ కమీషనర్ నాగమద్దయ్య, అసిస్టెంట్ కమీషనర్ మునిస్వామి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పెండింగ్ కేసులను పరిశీలించి చార్జి షీటు దాఖలు చేసి కోర్టు పనులు పూర్తి చేయాలన్నారు. కర్ణాటక మద్యం రవాణాపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు. పాత కేసుల నిందితులను బైండోవర్ చేయాలన్నారు. పట్టుబడ్డ వాహనాలను వేలం వేయాలని సూచించారు.
Job Suitcase

Jobs near you