అమెజాన్.. ఆన్‌లైన్ షాపింగ్ ప్రియులకు గుడ్‌న్యూస్ చెప్పింది. రిపబ్లిక్ డే పురస్కరించుకొని జనవరి 13-19 వరకు గ్రేట్ రిపబ్లిక్ సేల్ ప్రారంభించనున్నట్లు పేర్కొంది. సాధారణ యూజర్లు జనవరి 13న మధ్యాహ్నం 12 గంటల నుంచి, ప్రైమ్ యూజర్లు 12 గంటల ముందుగానే అంటే అర్ధరాత్రి నుంచే ఆన్‌లైన్ షాపింగ్ చేసుకోవచ్చని తెలిపింది. అలాగే ఈ సేల్‌లో ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులు, ఈఎంఐ కొనుగోళ్లపై 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చని పేర్కొంది.