హైదరాబాద్ మెట్రోలో రేపటి నుంచి సంక్రాంతి సంబరాలు మొదలు కానున్నాయి. 8, 9, 10 మూడు రోజుల పాటు మీటైం ఆన్ మై మెట్రో క్యాంపెన్ పేరిట ఈ వేడుకలను నిర్వహిస్తోంది. పండగ సంబరాలను ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్‌లో ప్రారంభించనున్నారు. వేడుకల్లో భాగంగా తెలుగుదనం ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలు, సంప్రదాయాలను ప్రతిబింబించేలా కార్యక్రమాలు, తెలుగు ఔన్నత్యాన్ని చాటేలా వేడుకలను నిర్వహించేందుకు ఎల్ అండ్ టీ ఏర్పాట్లు చేసింది.