గర్భాశయంలో 12 కేజీల కణితి.. ప్రాణాలు కాపాడిన వైద్యులు (వీడియో)

76చూసినవారు
AP: విజయనగరం జిల్లాలోని వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. కోరాపుట్‌కు చెందిన 55 ఏళ్ల భారతి పట్నాయక్ కడుపు నొప్పితో శృంగవరపుకోటలోని సంజీవిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేరింది. ఆమెను పరీక్షించిన వైద్యులు గర్భాశయంలో 12 కేజీల కణితిని గుర్తించారు. దీంతో తీవ్రంగా శ్రమించి ఆమె గర్భంలోని కణితిని విజయవంతంగా తొలగించి.. ఆమె ప్రాణాలను కాపాడినట్లు వైద్యులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్