ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈనెల 18వ తేది నుంచి 24వ తేది వరకు సూక్ష్మ క్రిమి నాశక మందుల నిరోధకత అవగాహన కార్యక్రమం వారోత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా శనివారం పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో బ్యాడ్రహళ్లి గ్రామం, కళ్యాణదుర్గం నార్త్ హైస్కూల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమంలో పశువైద్య శాల సహాయ సంచాలకులు డాక్టర్ శ్రీనివాసగుప్త మాట్లాడుతూ ఆంటీబయాటిక్ మందులు డాక్టర్ సలహాతో వాడాలన్నారు.