ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలు గురించి వినతి పత్రాల రూపంలో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకి శుక్రవారం ఉదయం కళ్యాణదుర్గంలోని తెలుగుదేశం పార్టీ ప్రజా వేదికలో అందజేశారు. ఎమ్మెల్యే సురేంద్రబాబు కూడా ప్రజల నుండి వినతి పత్రాలను స్వీకరించారు. కొన్ని సమస్యలను విచారించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మరికొన్ని సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం చేశారు.