బాంబు బెదిరింపు.. ఢిల్లీ-HYD విమానం దారి మళ్లింపు

58చూసినవారు
బాంబు బెదిరింపు.. ఢిల్లీ-HYD విమానం దారి మళ్లింపు
ఇండిగో, విస్తారా, ఆకాశ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాలకు బాంబు బెదిరింపు మెయిల్స్‌ రావడంతో ఆయా సంస్థల అధికారులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఎయిర్‌పోర్టుల్లో భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ రావాల్సిన విస్తారా విమానాన్ని దారి మళ్లించారు. మిగతా విమానాలు యథావిధిగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. కాగా వరుస బెదిరింపులతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్